సత్తుపల్లి గణనాథుడి పూజల్లో.. కాంగ్రెస్ ముఖ్యనేతలు
సత్తుపల్లి, సెప్టెంబర్ 19,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణ(Sathupalli town) పరిధిలోని సురేష్ టెంట్ హౌస్ రోడ్డులో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాథుడిని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ప్రత్యేకంగా దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని నాయకులు ప్రారంభించి, స్వయంగా భక్తులకు అన్నవితరణ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తిభావంతో పాటు సమాజ సేవ దృక్పథంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన ఉత్సవ కమిటీ సభ్యులను, నిర్వాహకులను వారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు మరియు మహిళా భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.