పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

19-09-2026 | 11:59am

ఏసిడిపివో తస్నీం సుల్తానా

సిద్దిపేట (విజయక్రాంతి): గర్భిణీ బాలింతలకు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని ఐసిడిఎస్, ఎసిడిపిఓ(ACDPO) తస్నీం సుల్తానా అన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో ఐసిడిఎస్ ఇంద్రనగర్ సెక్టార్ సూపర్వైజర్ స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టిక వారోత్సవాలలో ఆమె పాల్గొని మాట్లాడారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లలు గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం పొందాలని చెప్పారు. గర్భం దాల్చిన ప్రతి మహిళ వెంటనే సమీపంలోని అంగన్వాడి కేంద్రంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు(Anganwadi teachers) అరుణ, జ్యోతి, యమున తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు