నిమజ్జనానికి సర్వం సిద్ధం
నిమజ్జనానికి తరలివెళ్లిన హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణనాథుడు...
ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్..
రూ.34,500/ లడ్డును దక్కించుకున్న తిరుమల ప్రశాంత్..
సికింద్రాబాద్, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): వినాయక చవితి వేడుకలు(Vinayaka Chavithi Celebrations) ప్రజల్లో భక్తి భావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించాలని ముద్దం నరసింహ యాదవ్ ఆకాంక్షించారు.కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్ బోయిన్ పల్లి పరిధిలో హనుమాన్ నగర్ లో వినాయక నవరాత్రులనుపురస్కరించుకొని హనుమాన్ నగర్ వెల్ఫేర్‌అసోసియేషన్,కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన వినాయక నవరా త్రుల ఉత్సవాల భక్తిశ్రద్ధలతో ఘనంగా ము గిసాయి.
ఈ కార్యక్రమానికి హనుమాన్ నగర్ వెల్ఫేర్‌అసోసియేషన్,కమిటీ సభ్యులు, కాలనీ వాసు లు ఆహ్వానం మేరకు ఓల్ బోయిన్ పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యా దవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగాముద్దం నరసింహ యాదవ్ గణనాథుడినిదర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదానం కార్యక్రమం లో పాల్గొ న్నారు.
ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్ర జలందరి జీవితాల్లో ఆనందం,ఆరోగ్యం, శాంతి, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లాలని, ప్రజలపై గణపతి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ముద్దం నరసింహ యాదవ్ ఆకాంక్షించారు.అనంతరం హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ముద్దం నరసింహ యాదవ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గణేష్ మండపం వద్దనవరాత్రు లలో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలం దుకున్న గణేష్ లడ్డు ప్రసాదం,వేలం పాటలో తిరుమల ప్రశాంత్ రూ.34,500/ లడ్డును దక్కించు కున్నారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, కమిటీ సభ్యులు తిరుమల ప్రశాంత్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు ప్రత్యేక డ్రెస్ కోడ్ తో కోలాటం, తీన్మార్ డాన్స్ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.అనంతరం హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు,మహిళలు,యువకులు, భక్తులు తదితరులు శామీర్ పేట్ చెరువు కు నిమజ్జనానికి తరలి వెళ్ళారు. నిమజ్జనం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండాలి ముద్దం నరసింహ యాదవ్ తెలియజేశారు.
వినాయక నిమజ్జన ఊరేగింపులో విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం : జనరల్ బజార్ ఏఈ కాసం రవికుమార్
సికింద్రాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): వినాయక నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో విద్యుత్ భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భారీ వినాయక విగ్రహాలతో వాహనాలు, క్రేన్లు ఊరేగింపులో పాల్గొనే సమయంలో విద్యుత్ లైన్లు,సర్వీస్ వైర్ల విషయంలో నిర్వాహకులు ప్రజలు అప్రమత్తం గా ఉండాలని జనరల్ బజార్ ఏఈ కే.రవి కుమార్ సూచిస్తున్నారు.
సికింద్రాబాద్ ఊరేగింపు మార్గంలోని ఎంజీ రోడ్,ఆర్పీ రోడ్, ఎస్డీ రోడ్, గ్యాస్మండి, పాన్బజార్, రాణిగంజ్, కండోజి బజార్, జనరల్ బజార్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, సర్వీస్ వైర్లు వాహనాలు లేదా క్రేన్లకు అవసరమైన సురక్షిత దూరంలో ఉన్నాయా అనే విషయాన్నిముందుగానే పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఎక్కడైనా విద్యుత్ తీగలు వాహనం లేదా క్రేన్కు ప్రమాదకరంగా దగ్గరగా ఉన్నట్లు కనిపించినా, తీగలు తక్కువ ఎత్తులో వేలాడుతున్నా ప్రజలు స్వయంగా వాటిని తాకకుండా వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.సమాచారం అందిన వెంటనే టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది అవసరమైన విద్యుత్ భద్రతా చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. ముఖ్యంగా క్రేన్లు, భారీ వాహనాలు విద్యుత్ లైన్లకు సమీపంగా వెళ్లే సమయంలో నిర్వాహకులు, డ్రైవర్లు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.సంప్రదించాల్సిన నంబర్లు:
ఏఈ, జనరల్ బజార్: 8712470375,ఎఫ్‌ఓసీ: 8712470542 వినాయక నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా,సురక్షితంగా సాగేందుకు ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు విద్యుత్ భద్రతా నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని,టీజీఎస్ పిడీసీఎల్ టీం అవసరమైన విద్యుత్ భద్రతా చర్యలు చేపడుతుంది అన్ని జనరల్ బజార్ ఏఈ కే.రవి కుమార్ సూచించారు.
సరూర్ నగర్ చెరువు దగ్గర నిమజ్జన ఏర్పాట్లు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులు
ఎల్బీనగర్, సెప్టెంబర్ 24 : సరూర్ నగర్ చెరువు దగ్గర వినాయక నిమజ్జనం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బుధవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తి, భద్రత, బాధ్యతతో గణనాథుడి నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. నిమజ్జనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందునా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా,ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఈఈ కార్తీక్, బీఆర్‌ఎస్ నాయకులు గండికోట శ్రీనాథ్, కోమల్ తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి కాలనీలో గణనాథుని మండపం వద్ద అన్నదానం
ముషీరాబాద్, సెప్టెంబర్ 24(విజయాక్రాంతి): భోలక్ పూర్ డివిజన్ పద్మశాలి కాలనీలో నేతాస్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ యువనాయకుడు ముఠా జై సింహ, బింగి నవీన్, వై. శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నేతాస్ యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక యువత, భక్తులు పాల్గొన్నారు.
మాసబ్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
ఆదిభట్ల, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి):
తుర్కయంజాల్ మాసబ్ చెరువు వద్ద చేపడుతున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చెరువులో నీటి మట్టం ఎక్కువగా ఉన్నందున ప్రజలు నీటిలోకి వెళ్లకుండా కట్టడి చేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జనాన్ని ప్రశాంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి: ఎల్బీనగర్ డీసీపీ అనురాధ
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 24: గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ అనూరాధ తెలిపారు. గురువారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇన్నాంగూడ చెరువు వద్ద వినాయక నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లను ఆమె స్థానిక పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాల్లో బారికేడ్లు, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
నిమజ్జనం సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, అక్కడ అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ వి.అశోక్‌రెడ్డి, పిగ్లీపూర్ సర్పంచ్ కోట ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మందుగుల శ్రీశైలం తదితరులున్నారు.