calender_icon.png 30 June, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన..

29-06-2025 08:42:51 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): సీనియర్ పాత్రికేయులు ఎండి మునిర్ జ్ఞాపకార్థం రామకృష్ణాపూర్ పట్టణంలోని నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్నికి విశేష స్పందన లభించింది. ఆదివారం పట్టణంలోని స్థానిక సింగరేణి ఆర్కేఓసి క్లబ్(Singareni RKOC Club)లో మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ నేతృత్వంలో కరీంనగర్ రెనె ఆసుపత్రి(Rene Hospital) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పట్టణ ఎస్సై రాజశేఖర్, పుర కమిషనర్ రాజులు ప్రారంభించి మునిర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మునిర్ రచించిన అమ్మా తుజే సలాం అనే పుస్తకాన్ని ఎస్సై రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీనియర్ జర్నలిస్ట్ మునిర్ కోల్ బెల్ట్ ప్రాంతనికి ఎనలేని సేవలు అందించడం జరిగిందని ఆయన సేవలను కొనియాడారు.

మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ మాట్లాడుతూ... మునిర్ జ్ఞాపకార్థం ప్రతి నిరుపేద కుటుంబానికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వందల మంది రోగులకు గుండె, మూత్ర కోశ, నరాల, కంటి ఎముకల గైనకాలజి సంబంధిత రోగులకు జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్ వైద్యులు వైద్య సేవలు అందించి సలహా ఇచ్చారని, అలాగే బీపీ, షుగర్ పరీక్షలు, ఈసీజీ, టుడిగో పరీక్షలు నిర్వహించి లక్షల విలువ గల మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు.