కరెంటు అవగాహన సదస్సులో అధికారులను అడ్డుకున్న రైతులు

11-09-2026 | 08:13pm

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండలం(Chivvenla Mandal) చందుపట్ల గ్రామంలో కరెంటు అవగాహన సదస్సు(electricity awareness conference)కు వచ్చిన విద్యుత్ శాఖ అధికారులను గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు. రైతులకు(Farmers) నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని, 24 గంటలు సాధ్యం కాకపోతే కనీసం 14 గంటల పాటు కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని అధికారులను పొలాల వద్దకు తీసుకెళ్లి పరిస్థితిని చూపించారు. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు