కరెంటు కోతలపై రైతుల ఆగ్రహం.. ప్రధాన రహదారిపై ధర్నా

11-09-2026 | 08:36am

గద్వాల,సెప్టెంబర్ 11: వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటికి అవసరమైన సమయంలో కరెంటు అందక పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యుత్ కోతలను నిరసిస్తూ మల్దకల్ సబ్‌స్టేషన్(Maldakal Substation) ఎదుట గద్వాల–అయిజ ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు.

సమస్య పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు.రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.రైతుల ఆందోళన కొనసాగుతుండటంతో రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు