కట్టుకున్న భార్యే కడతేర్చింది.!

11-09-2026 | 12:26pm

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య

పోలీసుల అదుపులో నిందితులు.?

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో కరీం పాషా(Karim Pasha) అనే హోటల్ యజమాని అనుమానాస్పద స్థితిలో దారుణ హత్యకు గురైన ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. గదిలో రక్తపు మడుగులో పడి ఉన్న విషయాన్ని స్థానికుల సహాయంతో సమాచారం అందుకున్న సిఐ అశోక్ రెడ్డి తన బృందంతో కలిసి క్లూస్ టీం, డార్క్ స్పాట్ బృందాలతో తనిఖీలు జరిపారు.

హత్యకు పాల్పడిన వ్యక్తి బయట నుంచి తాళం వేసి పారిపోవడంతో క్లూస్ టీం ఆధారంగా ఫింగర్ ప్రింట్స్ సేకరించినట్లు తెలిసింది. ఫోన్ కాల్స్ ఆధారంగా అనుమానిత వ్యక్తిని విచారించగా భార్య సలీమా బేగం, ప్రియుడు గౌస్ పాషాతో కలిసి ఈ పథకం వేసినట్లుగా స్థానికంగా చర్చ జరుగుతుంది. భార్యను సైతం పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ అంశాన్ని పోలీసుల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

మరిన్ని వార్తలు