రామప్పను సందర్శించిన సినీనటుడు బండారు మాణిక్ రెడ్డి

27-09-2026 | 08:31pm

వెంకటాపూర్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం సినీనటుడు, కమెడియన్ బండారు మాణిక్ రెడ్డి(Film actor Bandaru Manik Reddy) సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ రామప్ప ఆలయ చరిత్ర, కాకతీయుల వైభవం, ఆలయ శిల్పకళ విశిష్టతలను మాణిక్ రెడ్డికి వివరించారు.

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన అనంతరం రామప్ప చెరువును సందర్శించి పర్యాటక శాఖ బోట్లలో బోటింగ్ చేశారు. బండారు మాణిక్ రెడ్డి అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో, గుంటూరు కారం, లక్కీ భాస్కర్ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన వెంట ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, బద్రు, శ్రీనివాస్‌తో పాటు పురావస్తు, దేవాదాయ, పర్యాటక శాఖల సిబ్బంది తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు