సేవకుని కుటుంబానికి ఆర్థిక చేయూత
17-09-2026 | 08:05pm
మృతుడి కుటుంబానికి అండగా డాక్టర్ గొల్లమందల నోవా
కల్లూరు,(విజయ క్రాంతి): అనారోగ్యంతో మృతి చెందిన క్రీస్తు సంఘ సేవకుడు నల్లగట్ల హానోకు (చిన్న రోశయ్య) కుటుంబానికి వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ డైరెక్టర్ డాక్టర్ గొల్లమందల నోవా ఆర్థిక సహాయం అందించారు. ఎర్రబోయినపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన హానోకు జ్ఞాపకార్థ కూడికలో పాల్గొన్న నోవా, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిరుపేద కుటుంబ పరిస్థితులను తెలుసుకుని కెసిఎంబిఐ ద్వారా హానోకు సతీమణి నల్లగట్ల రోషమ్మకు ఆర్థిక సాయం అందజేశారు.కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సేవకుని కుటుంబాన్ని ఆదుకున్న నోవాను పలువురు అభినందించారు.