మత్స్య సహకార సంఘం అధ్యక్షునికి వినతి

11-09-2026 | 11:24pm

మత్స్యకారులకు మార్కెట్‌లో స్టాల్స్‌ కేటాయించాలి

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్(Mahabubnagar) పట్టణంలో నూతనంగా ప్రారంభించిన మటన్‌, చేపల మార్కెట్‌లో మత్స్యకారుల(Fishermen ) కుటుంబాలకు చేపల విక్రయానికి స్టాల్స్‌ కేటాయించాలని మత్స్య సహకార జిల్లా అధ్యక్షులు గోనెల శ్రీనివాసులకు ఆ సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. మార్కెట్‌లో చేపల విక్రయంపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 150 మత్స్యకార కుటుంబాలకు స్టాల్స్‌ కేటాయించి న్యాయం చేయాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గోనెల రాములు, ప్రధాన కార్యదర్శి మడుగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు