సద్దుమణిగిన ఫ్లెక్సీ వ్యవహారం

16-09-2026 | 05:26pm

​చేగుంట, సెప్టెంబర్ 15, (విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన సర్పంచ్ పోరంల ఫ్లెక్సీ వ్యవహారంపై మంగళవారం రాత్రి  వ్యవహారం సద్దుమణిగినదని చేగుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు సండ్రుగు స్రవంతి సతీష్‌(Sandrugu Sravanthi Satish) అన్నారు. ఈ ఫోరంకి మండలంలో ఉన్న వివిధ గ్రామాల 15 మంది సర్పంచ్ లు మద్దతు తెలిపారని, ఉపాధ్యక్షురాలిగా బోనాల గ్రామ సర్పంచ్ గుర్జాకుంట సుకన్య నాగులుకు ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.

ఈ సందర్బంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ వ్యవహారంలో ఇటీవల కొందరు కావాలని సృష్టిస్తున్న అనవసర అపోహలు, తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని, మండల పరిధిలోని 15 మంది సర్పంచులమంతా ఒకే తాటిపై ఐక్యంగా ఉన్నామని, రాబోయే ఐదేళ్ల కాలం పాటు సండ్రుగు స్రవంతి సతీష్, గుర్జాకుంట సుకన్య నాగులు నేతృత్వంలో కలిసికట్టుగా పనిచేస్తూ మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచులు తేల్చిచెప్పారు.

మరిన్ని వార్తలు