ఆహారమే ఆరోగ్యానికి ఆయువు ఆయుర్వేదంతో ఆరోగ్య జీవనం
21-09-2026 | 05:24pm
యోగా, సమతుల ఆహారంతో శారీరక, మానసిక ఆరోగ్యం ఆయుష్ శాఖ
రాజన్న సిరిసిల్ల 21 సెప్టెంబర్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయుష్ శాఖ(AYUSH Department) ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని 2వ, 14వ వార్డుల అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో పోషక విలువలు కలిగిన పదార్థాలను చేర్చుకోవాలని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.
సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. ఆయుర్వేదం మన జీవన వేదమని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడంలో ఆయుర్వేదానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు.