మాజీ ఎమ్మెల్యే బర్త్ డే సెలబ్రేషన్స్

30-09-2026 | 01:03pm

మూసాపేట్, సెప్టెంబర్ 30(విజయ క్రాంతి): మూసాపేట్ మండల పరిధిలోని వేముల  స్టేజ్ హనుమాన్ టెంపుల్ దగ్గర బుధవారం ఘనంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Former MLA Ala Venkateswar Reddy) జన్మదిన వేడుకలు. మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్, మాజీ జెడ్పిటిసి ఇంద్రయ్య సాగర్, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు రెడ్డి రాజు,రఘు రాములు,రవి, మండల వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు