24 August, 2026 | 2:33 AM

వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

24-08-2026 01:25 AM

బిక్కనూర్, ఆగస్టు 23 (విజయక్రాంతి): బిక్కనూర్ మండలం అంతంపల్లి మాజీ ఏఎంసీ చైర్మన్ దివంగత చిట్టెడి భగవంత్రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బిక్కనూర్, రాజంపేట మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.