గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి

03-10-2026 | 08:36pm

మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి 

భూత్పూర్ : జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Election) ఓటురు నమోదు ప్రక్రియ(Voter registration process) పై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Ala Venkateswar Reddy) అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) సన్నాహక సమావేశం భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో(Annasagar Village) మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ఆల ప్రీతిరెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు అత్యంత కీలకమని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నెల రోజులపాటు ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముందుగా పార్టీకి చెందిన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవడంతో పాటు గ్రామాల వారీగా పట్టభద్రులను గుర్తించి నమోదు చేయించాలని కోరారు.

గతంలో ఓటు నమోదు చేసుకున్న వారితోనూ మరోసారి నమోదు ప్రక్రియ పూర్తి చేయించాలని, పాత ఓటరు జాబితాలను ఉపయోగించుకుని పట్టభద్రులను ఫోన్ ద్వారా సంప్రదించి ఓటు నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించిందని, సిట్టింగ్ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకునేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

దేవరకద్ర నియోజకవర్గంలో సుమారు 11 వేల మంది పట్టభద్రులు ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. అధికారంలో లేకపోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామని, అదే స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పనిచేయాలని కోరారు.

మరిన్ని వార్తలు