విశ్వకర్మ జయంతి మహోత్సవాల్లో పాల్గొన్న మాజీ ప్రొటెం చైర్మన్

17-09-2026 | 07:58pm

రామచంద్రపురం ఆగస్టు 17: రామచంద్రపురం మండలం(Ramachandrapuram Mandal) బీహెచ్ఈఎల్ టౌన్షిప్‌లోని విశ్వకర్మ దేవాలయం(Viswakarma Temple) ప్రాంగణంలో విశ్వకర్మ జయంతి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొని విశ్వకర్మ మహర్షికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకర్మ మహర్షి సృష్టికర్తగా, శిల్పకళ, వాస్తుశాస్త్రం, యంత్రాంగాల సృష్టికి ప్రతీకగా భావించబడతారని తెలిపారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా శిల్పులు, వృత్తిదారులు, కర్మచారులు, కార్మిక వర్గం ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, జగన్నాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు