25 August, 2026 | 11:17 AM

నిజమాబాద్‎లో మాజీ సర్పంచ్ వెంకటి హత్య

25-08-2026 10:46 AM

నిజామాబాద్ ఆగస్టు25(విజయక్రాంతి):  ఇది నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లిలో విషాదం జరిగింది. మాజీ సర్పంచ్ వెంకటిని మాజీ ఎంపీటీసీ నారాయణ గొడ్డలితో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భూతగాదాలే హత్యకు కారణమని, హత్య అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.