వీధి కుక్కల స్వైరవిహారం.. బెంబేలెత్తుతున్న కాలనీవాసులు!

24-10-2026 | 11:12am

ఆసిఫాబాద్‌, అక్టోబర్ 24 (విజయక్రాంతి): పట్టణంలోని పైకాజి నగర్‌లో వీధి కుక్కల బెడద (Stray Dog Menace) రోజురోజుకూ పెరుగుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధుల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు.

ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలు కుక్కల కారణంగా ఆందోళనకు గురవుతున్నారు. రాత్రివేళల్లో ద్విచక్ర వాహనదారులను కుక్కలు వెంబడిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో కుక్కల సంచారం పెరగడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత అధికారులు స్పందించి పైకాజి నగర్‌లో కుక్కల బెడదను నియంత్రించేందుకు తక్షణ చర్యలు (Immediate Action) చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులకు రక్షణ కల్పించేలా మున్సిపల్‌ అధికారులు ప్రజా భద్రత (Public Safety)కు ప్రాధాన్యమిస్తూ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు