26న ఆశా వర్కర్ల ఐక్య పోరు

24-10-2026 | 11:07am

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి (విజయక్రాంతి): ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ నిమ్మల మధు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దుబ్బా ధనలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (ASHA Workers Union) ఆధ్వర్యంలో మంగపేట ప్రభుత్వ వైద్యాధికారి సాయి కళ్యాణ్‌కు వినతిపత్రం (Petition) అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తున్న వారిని ముందస్తుగా అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని హెచ్చరించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ మండల నాయకులు కురం నాగలక్ష్మి, మాణిక్యమ్మ, నాగమణి, జ్యోతి, మీనా, పావని, లాల్‌బీ, శైలజ, కుమారి, పార్వతి, రోషమ్మ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు