కొత్తపల్లి వినాయక నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కొత్తపల్లి,(విజయక్రాంతి): వినాయక నవరాత్రుల సందర్భంగా కొత్తపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Former SUD Chairman Komatireddy Narender Reddy) పరిశీలించారు. గతంలో నిమజ్జనం చేసే ప్రాంతం భూమి పట్టాదారు కోర్టుకు వెళ్లడంతో నిమజ్జన స్థలం మార్చవలసి వచ్చినందున నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు నరేందర్ రెడ్డి సూచించారు. పట్టాదారు కిషన్ రెడ్డి ఏర్పాట్లు చేసే ప్రాంతానికి వచ్చి మా భూమిని వాడుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదని దాని బదులు వేరే భూమి ఇవ్వాలని మాత్రమే ప్రభుత్వాన్ని కోరుతున్నానని నరేందర్ రెడ్డి తో పేర్కొన్నారు.
సమస్య కోర్టు పరిధిలో ఉన్నందున తిరిగి కోర్టుకు తెలియజేసి ఆ స్థలాన్ని వాడుకోవలసి ఉంటుందని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.కొత్తగా నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్న స్థలం పరిధి ఎక్కువగా ఉండేట్టు చూడాలని నిమజ్జనానికి 500 లకు పైగా విగ్రహాలు ఇక్కడికి వస్తాయని నిమజ్జనం చేసిన తరువాత వాహనాలు వెంటనే అక్కడినుండి ఖాళీ అయ్యేవిధంగా ఏర్పాట్లు చేయాలని నరేందర్ రెడ్డి అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సిఐ బిల్లా కోటేశ్వర్,మున్సిపల్ సిబ్బంది పరశురాములు కాంట్రాక్టర్ సతీష్ స్థానిక నాయకులు గడ్డం శ్రీనివాస్,పొన్నం శ్రీనివాస్,గున్నాల రమేష్,ఖాజా,దుబ్బాసి కుమార్,తుమ్మ ప్రతాప్ రెడ్డి,రాపర్తి రాజు,చింతల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.