ఉచిత కంటి వైద్య శిబిరాలు
దండేపల్లి,(విజయక్రాంతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల, వెల్గనూర్, ద్వారకా గ్రామాల్లో రఘునాథ వెరబెల్లి ఫౌండేషన్(Raghunatha Verabelli Foundation) ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరాలను బీజేపీ(BJP) రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి,జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోదీ జన్మదిన సందర్భంగా వారం రోజుల పాటు వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,వివిధ గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డేగ బాపు, గోపతి రాజయ్య, బెడద సురేష్, పత్తిపాక సంతోష్, బత్తుల శేఖర్, బండే సత్యం, మొరుపుటల సంజీవ్, గడికొప్పుల సురేందర్, ఎంబడి సురేందర్, నలిమెల మహేష్, లక్కాకుల బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.