17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మేడారంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభం

27-01-2026 09:07 PM

మేడారంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సీతక్క, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు

మంథని,(విజయక్రాంతి): మేడారంలో గిరిజన మ్యూజియం ఎదురుగా హన్మకొండకు చెందిన చక్రవర్తి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ తరుణ్ రెడ్డి – డాక్టర్ చంద్రిక దంపతులు, సమ్మక్క–సారలమ్మ తల్లుల జాతరకు విచ్చేసే లక్షలాది భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు  కలిసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జాతరకు వచ్చే భక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం ముందుకు వచ్చి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న చక్రవర్తి హాస్పిటల్ యాజమాన్యాన్ని, డాక్టర్ తరుణ్ రెడ్డి – డాక్టర్ చంద్రిక దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని కొనియాడారు.