పూసాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేత

11-09-2026 | 06:45pm

సుల్తానాబాద్, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్(Sultanabad Municipality) పరిధిలోని పూసలలో 14వ వార్డు కౌన్సిలర్ వేగోళం పద్మ అబ్బయ్య గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూలు పిల్లలకు ఉచిత యూనిఫామ్స్, షూస్ ని  సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ పంపిణీ చేశారు,  అనంతరం పిల్లలతో కలిసి కౌన్సిల్ సభ్యులు  మధ్యాహ్న భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు గాజుల రాజమల్లు . ఈర్ల స్వరూపశేఖర్ . వర ప్రదీప్ . గాదాసు  మంజుల రవీందర్ . తొర్రికొండ ప్రభాకర్ . శంకరమ్మ ఓదెలు  . పట్టణ మహిళా అధ్యక్షురాలు బండ మాధవి , మెప్మా సంఘం మహిళలు,ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు