సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య

11-09-2026 | 07:45pm

యూనిఫామ్, షూ, బెల్ట్ పంపిణీ కార్యక్రమం

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మండల విద్యాధికారి భీమ్ సింగ్

మునిపల్లి,(విజయక్రాంతి): సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య  అందుతుందని రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మండల విద్యాధికారి భీమ్ సింగ్ సూచించారు. స్థానిక మునిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(Munipalli Government School)లో శుక్రవారం విద్యార్థులకు ప్రభుత్వం అందించిన యూనిఫామ్, షూ, బెల్ట్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) చైర్మన్ మంతూర్ సుధాకర్ రెడ్డి, మండల విద్యాధికారి భీమ్ సింగ్ హాజరై మాట్లాడారు.  విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆరోగ్యం, పాఠశాల హాజరు మరియు సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక సౌకర్యాలను అందిస్తోందన్నారు.

ఉచిత యూనిఫామ్, షూ, బెల్ట్, అల్పాహారం, ఉచిత విద్య, ఉచిత విద్యుత్, ప్రీ-ప్రైమరీ పాఠశాలలు, ఉచిత మధ్యాహ్న భోజనం, విద్యార్థులకి అవసరమైన ఫర్నిచర్, వంటి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.  అలాగే ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.

అదే విధంగా పాఠశాలలో ఉపాధ్యాయులు(Teachers) విద్యార్థుల విద్యాభివృద్ధిపై చూపుతున్న శ్రద్ధను వక్తలు అభినందించారు. ఉపాధ్యాయుల సమిష్టి కృషితో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మధురిమ మాట్లాడుతూ గ్రామపెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకారం మరియు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయల కారణంగా ఈ విద్యాసంవత్సరం కొత్తగా 50 అడ్మిషన్లు రావడం చాలా సంతోషంగా ఉందని తమపై నమ్మకంతో పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యని అందిస్తామని తమకి సహకరిస్తున్న గ్రామ పెద్దలందరికి ధన్యవాదాలు తెలిపారు. 

అనంతరం రూమ్ టు రీడ్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి సంధ్య మాట్లాడుతూ అంతర్జాతీయ అక్షంరాస్యత దినోత్సవం ను పురస్కరించుకుని దేశంలోని ప్రతి బిడ్డ చదవాలి - ప్రతి బిడ్డ ఎదగాలి అనే సందేశంతో రీడ్-ఎ-థాన్   కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు పుస్తక పఠనం గురించి  విద్యార్థులకి అవగాహన కల్పించి విద్యార్థులలో పఠన నైపుణ్యాలను పెంచేందుకి కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి పఠన కార్యక్రమంలో పాల్గొని ఇంటి వద్ద పిల్లలు పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలని తెలిపారు.

మరిన్ని వార్తలు