స్వాతంత్ర సమరయోధుడు... కొండా లక్ష్మణ్ బాపూజీ

27-09-2026 | 09:53pm

 ఘనంగా 111వ, జయంతి వేడుకలు 

నివాళులర్పించిన డాక్టర్ యాదగిరి

జవహర్ నగర్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): జవహర్ నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి డాక్టర్ యాదగిరి(Dr. Yadagiri) పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ యాదగిరి మాట్లాడుతూ... "స్వాతంత్ర్య సమరయోధుడు, సాయుధ పోరాట స్ఫూర్తి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు దిక్సూచిగా నిలిచిన శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి త్యాగం, స్థైర్యం చిరస్మరణీయం.

ఆయన ప్రజాసేవకు, పోరాటాలకు గుర్తుగా ప్రభుత్వం 'శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం(Sri Konda Laxman Telangana State Horticultural University)' ఏర్పాటు చేయడం ఆయనకు లభించిన తగిన గౌరవానికి నిదర్శనం" అని అన్నారు.పోరాట స్ఫూర్తికి, ప్రజాసేవా నిబద్ధతకు ప్రతీకగా నిలిచి, భావితరాలకు మార్గదర్శకంగా నిలిచిన ఆ మహనీయుని బాటలో నేటి యువత నడవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమం లో వెంకన్న, చంద్రమౌళి, శ్రీధర్, కటికం శ్రీనివాస్, మల్లేష్, శ్రీధర్, పవన్,భాను, కుమార్, వెంకటేష్,సీత కాళిదాసు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు