24 March, 2026 | 2:19 AM

జాబ్ క్యాలెండర్‌తో భవిష్యత్‌కు భరోసా

05-08-2024 12:57 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండ ర్‌ను విడుదల చేయడం హర్షణీయమని భాగ్యనగర్ ఇన్‌స్టిట్యూట్ టాపర్స్ డైరెక్టర్ మల్యాద్రి అన్నారు. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ ఆదివారం భాగ్య నగర్ ఇన్‌స్టిట్యూట్‌లో అభ్యర్థులు, అధ్యాపకులతో కలిసి.. సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్‌తో నిరుద్యోగులకు భవిష్యత్‌కు భరోసా దొరికినట్లుందన్నారు. ప్రణాళిక ప్రకారం చదువుకునేందుకు వారికి సమయం ఇచ్చినట్లుందని భాగ్యనగర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మల్యాద్రి అన్నారు.