గజ్వేల్‌లో మళ్లీ టెన్షన్.. చెప్పులు, రాళ్లతో దాడులు
08-09-2026 | 02:34pm
గజ్వేల్: నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరదరాజ్‌పూర్‌లో కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్ కార్యకర్తలు దహనం చేయగా, పోటీగా కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశాయి. అనంతరం ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగి చెప్పులు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.