మహాత్మగాంధీ ఆశయ సాధనకు కృషి చేద్దాం

02-10-2026 | 06:53pm

గుండ్లపోచంపల్లి, కండ్లకోయ మున్సిపల్ పట్టణాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మాజి సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి

మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 2(విజయక్రాంతి): భారత దేశ స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని గుండ్లపోచంపల్లి, కండ్లకోయ గ్రామాల మాజి సర్పంచ్ లు మద్దుల శ్రీనివాస్ రెడ్డి(Maddula Srinivas Reddy), కందాడి నరేందర్ రెడ్డి లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింస మార్గంతో స్వాతంత్ర్యం సాధించడంలో ప్రపంచానికి స్ఫూర్తిదాతగా మహాత్మగాంధీ నిలిచారని వారు స్పష్టం చేశారు. శుక్రవారం గుండ్లపోచంపల్లి, కండ్లకోయ మున్సిపల్ పట్టణాలలోని మహాత్మగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి పోరాటాన్ని వారు కొనియాడారు. గాంధీజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి గాంధీజీ అడుగు జాడల్లో నడవాలని శ్రీనివాస్ రెడ్డి,నరేందర్ రెడ్డి లు కోరారు.

ఈ కార్యక్రమంలో మాజి సర్పంచ్ లు అప్పమ్మగారి జగన్ రెడ్డి.చిట్టిమిల్ల రాగజ్యోతి.చిట్టిమిల్ల గణేష్ నేత.బండారి నరేందర్ ముదిరాజ్.మున్సిపల్ మాజి కౌన్సిలర్ లు అమరం హేమంత్ రెడ్డి.అమరం జైపాల్ రెడ్డి.బేరీ బాలరాజు. చింత పెంటయ్య ముదిరాజ్.డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ సంజీవ్ గౌడ్.ఎస్ జనార్ధన్ రెడ్డి.మల్లారెడ్డి.సారా పద్మారావు.ఎస్ సత్తిరెడ్డి.కండ్లకోయ 299 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి సురేందర్ ముదిరాజ్.కండ్లకోయ మాజి కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్.గువ్వ రవి ముదిరాజ్.ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తలారి పెంటేష్ ముదిరాజ్.పి వీరస్వామి.యూత్ అధ్యక్షులు నవీన్ ముదిరాజ్. తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు