ఇస్లాంపూర్ లో విబిజి-రామ్ జి గ్రామసభ.
02-10-2026 | 10:19pm
తూప్రాన్, అక్టోబర్ 2, (విజయక్రాంతి): తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో గాంధీ జయంతి(Gandhi Jayanti) వేడుకలను గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో విబిజి-రామ్ జి అనే గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో గ్రామంలో నెలకొన్న సమస్యలపై మాట్లాడినారు, సమస్య పరిష్కారం కొరకు ప్రతి ఒక్కరు సహకరించాలని గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు. ఇందులో గ్రామ సెక్రెటరీ, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.