నగరపాలక సంస్థ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర
23-09-2026 | 08:09pm
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయ(Karimnagar Municipal Corporation office)లో ప్రతిష్టించిన వినాయకుడికి అత్యంత భక్తిశ్రద్ధలతో చివరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణలు, మంగళహారతుల నడుమ స్వామివారి విగ్రహాన్ని కదిలించి నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్(Municipal Commissioner Praful Desai)లు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.