వినాయకుడి లడ్డూ వేలంలో రికార్డు

23-09-2026 | 03:23pm

భూత్పూర్: భూత్పూర్ మున్సిపాలిటీ(Bhutpur Municipality) పరిధిలోని అమిస్తాపూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో వినాయక స్వామి లడ్డు వేలం పాట నిర్వహించారు.  వినాయకుడి లడ్డూ వేలం(Ganesh laddu auction) పాటలో రూ.50 వేలకు మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి దక్కించుకున్నారు. అనంతరం మరో చిన్న లడ్డును కూడా రూ. 6 వేలకు చైర్మన్ లడ్డు వేలం పాటలో సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... వినాయక మండపంలో భక్తిశ్రద్ధలతో నిత్యం పూజలు అందుకున్న వినాయకుడి లడ్డును దక్కించుకోవడం అదృష్టం అన్నారు. అనంతరం ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు లడ్డును దక్కించుకున్న చైర్మన్ బాలకోటి కి ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు పవన్ కుమార్ తో పాటు సభ్యులు ఆంజనేయులు, రఘునందన్ గౌడ్ , డోకుర్ శంకర్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు