గణేష్ మండపాలు నమోదు చేసుకోవాలి

10-09-2026 | 12:05am

సదాశివనగర్,(విజయక్రాంతి): గాంధారి, తాడ్వాయి, సదశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విగ్రహాలు ఏర్పాటు చేస్తూనే మండపాల నిర్వాహకులు మా మండపాలను ఆన్లైన్లో ద్వారా నమోదు చేసుకోవాలని సదాశివ నగర్ సిఐ వీరయ్య అన్నారు. ఈ మేరకు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...  గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని, గణేష్ మండపాల నిర్వహణకు సంబంధించిన పోలీస్ శాఖ రూపొందించిన ఆన్లైన్ ఇంటిమేషన్ విధానం ద్వారా మండపాల వివరాలను ముందస్తుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.

మండపాల వివరాలను ముందుగా పోలీసులకు తెలియజేయడం వల్ల ఆయా ప్రాంతాలలో భద్రత బందోబస్తు ఏర్పాటు చేయడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఆన్లైన్ ఇంటిమేషన్ నమోదుకు ఎలాంటి రుసుము లేదని స్పష్టం చేశారు. గణేష్ మండపాల నిర్వాకులు కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా పోలీస్ శాఖ వెబ్ సైట్ లో వివరాలను నమోదు చేసి దరఖాస్తును సంబంధిత పోలీస్ స్టేషన్ కు అందజేయాలని సూచించారు. గణేష్ మండపాలను ప్రజా రవాణాకు అత్యవసర వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అనుమతులతో పాటు విద్యుత్ శాఖ అనుమతి తీసుకొని తర్వాత విద్యుత్ కనెక్షన్ పొందాలని తెలిపారు.

మండపాల పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని గణేష్ మండపం వద్ద నిర్వాహకుల పేర్లు ఫోన్ నంబర్లు స్పష్టంగా ప్రదర్శించాలని 24 గంటల పాటు కనీసం నలుగురు వాలంటరీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.మండపాల వద్ద బుక్కు ఏర్పాటు చేసుకోవాలని ఉదయం సాయంత్రం రాత్రి సమయంలో పోలీస్ సిబ్బంది పరిరక్షణకు వచ్చినప్పుడు నిర్వాహకులు సహకరించాలని కోరారు.గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రదేశంలో షెడ్డును నాణ్యతతో నిర్మించాలని,విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదునీ, గణేష్ మండపాలల్లో శోభయాత్రలలోఎట్టి పరిస్థితుల్లోను డీజే లను ఏర్పాటు చేయరాదని సిఐ వీరయ్య  స్పష్టం చేశారు.

విద్యా సంస్థలు ఆసుపత్రిలో ప్రార్థన మందిరాలు వృద్ధులు. చిన్నపిల్లలకు ఇబ్బంది కలగకుండా పోలీసుల అనుమతితో చిన్న స్పీకర్లను మాత్రం వినియోగించాలని సూచించారు. మండపాల వద్ద భక్తు గీతాలను మాత్రమే ప్లే చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించుకోవాలని తెలిపారు. మండపాల వద్ద మద్యం సేవించడం జూదం ఆడడం అసభ్యకరంగా నృత్యాలు నిర్వహించడం. ఇతరులను కించపరిచేలా ప్రసంగాలు లేదా పాటలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.

మండపాల వద్ద అనుమానాస్పద బ్యాగులు వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే డైల్ 112 లేదా తాడ్వాయి  గాంధారి  సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు. మండపాల వద్ద నిర్వహించే సంస్కృతి ఇతర కార్యక్రమాల వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. గణేష్ ప్రతిష్టాపన రోజున నిర్ణీత సమయానికి విగ్రహాన్ని మండపానికి చేర్చేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు నిమర్జనం శోభయాత్రను మధ్యాహ్నం నుంచే ప్రారంభించి నిర్ణయించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలి. ఇతరులపై రంగులు చల్ల రాదని ఇతరులను కించపరిచేలా నినాదాలు చేయరాదని సూచించారు శోభయాత్రలు టపాసులు పేల్చడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.

M డ్రైవర్ కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉండాలని తెలిపారు. గణేష్ ఉత్సవాల  సందర్భంగా ఎక్కడైనా ఎలాంటి అవాంఛనియ సంఘటనలు జరుగుతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రతి గ్రామంలో పోలీస్ సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్ జరుగుతుందన్నారు. మహిళలు పిల్లలకు ఇబ్బందులు కలిగించే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని పోలీస్ శాఖ సూచించిన నియమ నిబంధనలను పాటిస్తూ గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని సదాశివనగర్   సీఐ వీరయ్య కోరారు.

మరిన్ని వార్తలు