ఘనంగా గణనాథుల శోభయాత్ర

23-09-2026 | 08:06pm

డోలు బాజాలతో దద్దరిల్లిన కాలనీలు

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడువాయి మండల కేంద్రంలో బుధవారం గణనాథుల శోభాయాత్ర(Ganesh procession) వైభవంగా జరిగింది. ప్రత్యేక వాహనాలలో గణనాథులను ఉంచి శోభాయాత్ర నిర్వహించారు.మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా శోబయాత్ర కొనసాగింది. భక్తులు(Devotees) గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యువకులు గణనాథుడి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. డోలు భాజాలతో కాలనీలు దద్దరిల్లాయి. ఎంతో అందంగా అలంకరించిన గణనాథుల వాహనాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఎలాంటి డీజెల్ లేకుండానే డోలు బాజాలతో గణనాథుల ఊరేగింపు కొనసాగింది. రాత్రి సమయంలో గణనాథులను నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు