6 September, 2026 | 12:20 AM

వినాయక చవితి సందర్భంగా సుందరమైన విగ్రహాల నెలవు

05-09-2026 | 10:56pm

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మున్సిపల్ బైపాస్ లో వినాయక చవితి(Ganesha Chavithi) సందర్భంగా భారీ స్థాయిలో వినాక విగ్రహాలను స్వయంగా తయారు చేసి అమ్మకాలకు సిద్ధంగా ఉంచారు. గత 50 సంవత్సరాలుగా 25 సంవత్సరాల అనుభవం కలిగిన నిపుణుల చేత వినాయక విగ్రహాలు పలు రకాల డిజైన్లతో రూపుదిద్దుకోవడం జరుగుతుంది. చాలా చక్కటి ప్రతిభ కలిగినటువంటి శిల్పిల ద్వారా విగ్రహాలు నాణ్యత కలిగిన వస్తువుల చేత తయారుచేసి అమ్మకాలకు సిద్ధంగా ఉంచారు. ఈ నేపథ్యంలో వినాయక యజమాని బాటి జీవన్ మాట్లాడుతూ... గత నాలుగు సంవత్సరాలుగా తూప్రాన్ బైపాస్ లో విగ్రహాలు తయారు చేయడం జరుగు తుందనీ మా బ్రాంచ్ లు చేగుంట నరసాపూర్ పరిధిలో ఉన్నాయని అన్నారు. మా వద్ద మూడు ఫీట్ల నుండి పది ఫీట్ల వరకు వివిధ రకాల విగ్రహాలు అతి తక్కువ ధరలకు వినాయక విగ్రహాలను అమ్మకాలు జరుపుతామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు