6 September, 2026 | 2:36 AM

బీరు సీసాలో చెత్త... మద్యం ప్రియుల్లో ఆందోళన

06-09-2026 | 12:32am

రాజాపూర్: మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలోని మద్యం దుకాణంలో శనివారం వినియోగదారులు బీరు సీసాలను (కింగ్ ఫిషర్ ) కొనుగోలు చేయడంతో ఒక బీరు సీసాలో చెత్త, మలిన పదార్థాలు కనిపించడంతో మద్యం ప్రియులు ఆందోళన  చెందారు. వినియోగదారుడు కొనుగోలు చేసిన సీసాలో మలినాలు ఉన్నట్లు కనిపిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు న్యూస్ టుడే కు తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలు, సరఫరా వ్యవస్థపై తనిఖీలు చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు