కేజీబీవీని సందర్శించిన బాలికల అభివృద్ధి అధికారి

10-09-2026 | 11:53pm

కోనరావుపేట,(విజయక్రాంతి): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (Kasturba Gandhi Girls School) కోనరావుపేటను బాలికల అభివృద్ధి అధికారి (Girls Development Officer) సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగది, భోజనశాలను పరిశీలించారు. అనంతరం 6వ తరగతి విద్యార్థినులతో ముచ్చటించి వారి విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో నాబార్డ్ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను పరిశీలించి, వాటి పురోగతిని సమీక్షించారు.

అనంతరం పాఠశాల ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విద్యార్థినులకు(Students) నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు విలువైన సూచనలు చేశారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల సంక్షేమం విషయంలో సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ ఇంద్ర ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు