రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన బాలికలు
23-09-2026 | 07:40pm
తాడ్వాయి,(విజయక్రాంతి): తాడ్వాయి మండల కేంద్రంలోని మా గార్డెన్ లో నిర్వహించిన కబడ్డీ(kabaddi) బాలికల విభాగం సెలక్షన్స్ లో 14 మంది బాలికలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు కామారెడ్డి జిల్లా(Kamareddy District) కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ జి భాస్కర్ తెలిపారు.గత వారం రోజుల నుంచి మా గార్డెన్ లో బాలికల సెలక్షన్స్ లో భాగంగా క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఈ క్రీడాకారులు ఈనెల 26 నుంచి 29 వరకు వేములవాడలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి సిహెచ్ రాజన్న, ఉపాధ్యక్షులు అంబీర్ శ్యాం రావు, కోశాధికారి శ్రీనివాసరెడ్డి, ఆర్గనైజేషన్ కార్యదర్శి నగేష్, జీన్స్ సెక్రటరీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.