భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

27-09-2026 | 07:47pm

ఆదివారం సాయంత్రం 43 అడుగుల చేరుకున్న గోదావరి 

భద్రాచలం, సెప్టెంబర్ 27, (విజయక్రాంతి): గోదావరి పరివాహక  ప్రాంతంలో(Godavari river basin) కురిసిన భారీ వర్షాలు(Heavy rains) మూలంగా భద్రాచలం(Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్నది. 6 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక(Danger Warning) కు చేరువైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అర్థరాత్రికి 45 అడుగులకు చేరుకుంటుందని అదికాదులు అంచనా వేస్తున్నారు.

సెప్టెంబర్ ఆఖరి వారంలో  గోదావరి వరద ప్రమాదకర స్థితిలో రావడంతో తీవ్రంగా నష్టపోయారు. గోదావరి నదికిరువైపులా ఉన్న భద్రాచలం పినపాక నియోజక వర్గాలలో వేలాది ఎకరాలలో వేసిన  మిరప పంట పత్తి పునాస పంటలు కాలువల గుండా వచ్చిన  గోదావరి బ్యాక్ వాటర్ తో మునిగిపోవడం వల్ల  రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు