హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు
హైదరాబాద్: బంగారం ధరలు(Gold prices) రోజురోజుకు కొండెక్కుతున్నాయి. హైదరాబాద్లో(Hyderabad) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1.52,830 కాగా, 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ. 1,40,090 గా ఉంది. ఇక నగరంలో కిలో వెండి రూ. 2,49,900గా ఉంది. ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండే వెండి ఇప్పడు బంగారాన్ని వెనక్కి నెట్టి పరుగులు పెడుతుంది.
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ. 1,52,840 వద్ద, అలాగే వెండి ధర కిలోకు రూ. 2,38,000 సమీపంలోనూ కొనసాగుతోంది. ఢిల్లీ నగరం 24K బంగారం (10 గ్రా) రూ.1,52,800, వెండి (1కిలో) ₹2,37,230, ముంబై ₹1,52,840, వెండి (1 కిలో) ₹2,37,640, చెన్నై ₹1,53,100, వెండి (1 కిలో)₹2,38,330, కోల్కతా ₹1,52,850, వెండి (1 కిలో)₹2,37,330, బెంగళూరు ₹1,52,750, వెండి (1 కిలో)₹2,37,830 గా కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.