పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్లో పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల రేటు ఎంతంటే?
హైదరాబాద్: బంగారం ధరల్లో మళ్లీ ఒక్కసారిగా కదలిక కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నిన్న తగ్గిన Gold Rate Today Hyderabad ఇవాళ తిరిగి పెరిగింది. ముఖ్యంగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,000కుపైగా పెరగడంతో పసిడి కొనుగోలుదారుల దృష్టి మరోసారి ధరలపై పడింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24(24 Carat Gold Rate) క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 పెరిగి రూ.1,50,280కు చేరింది. అంటే నిన్నటితో పోలిస్తే పసిడి ధరలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల Gold Rate రూ.950 పెరిగి రూ.1,37,750 వద్ద కొనసాగుతోంది.
అటు వెండి ధరల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. హైదరాబాద్ మార్కెట్లో కిలో Silver Rate రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు, ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ఆభరణాలు తీసుకునేవారు తాజా రేట్లను గమనిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నగరం, ప్రాంతం, నగల దుకాణాన్ని బట్టి Gold Price Todayలో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రకటించిన ధరలకు 3 శాతం GST అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో మేకింగ్ ఛార్జీలు, ఇతర పన్నులు కలిస్తే తుది బిల్లు మరింత మారవచ్చు.