లవ్లీనా పంచ్‌కు గోల్డ్
12 ఏళ్ల తర్వాత భారత్‌కు మహిళల బాక్సింగ్ గోల్డ్
నిషియో (జపాన్), అక్టోబర్ 2: భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్(Lovlina Borgohain Gold) చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడలు 2026లో( Lovlina Borgohain Asian Games 2026) మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో చైనాకు చెందిన జియీ బావోపై(Lovlina vs Ziyi Bao) 5-0 తేడాతో ఏకగ్రీవ విజయం సాధించి.. భారత పతకాల ఖాతాలో మరో గోల్డ్‌ను చేర్చింది. ఫైనల్‌లో లవ్లీనా తన పంచ్‌లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదుగురు జడ్జిలూ లవ్లీనా వైపే మొగ్గు చూపడంతో 5-0 unanimous decisionతో విజయం ఖరారైంది. గత ఆసియా క్రీడల్లో రజతంతో సరిపెట్టుకున్న లవ్లీనా.. ఈసారి పతకం రంగును మార్చుకుని స్వర్ణాన్ని అందుకుంది.
12 ఏళ్ల నిరీక్షణకు తెర..
భారత మహిళల బాక్సింగ్‌కు ఆసియా క్రీడల్లో స్వర్ణం(Asian Games Boxing Gold) కోసం కొనసాగుతున్న 12 ఏళ్ల నిరీక్షణకు లవ్లీనా తెరదించింది. అంతేకాదు, ఆసియా క్రీడల్లో బాక్సింగ్ స్వర్ణం సాధించిన రెండో భారత మహిళగా రికార్డు సృష్టించింది. ఈ జాబితాలో దిగ్గజ బాక్సర్ ఎంసీ మేరీ కోమ్ ముందున్నారు. 2022 ఆసియా క్రీడల్లో లవ్లీనా రజత పతకం సాధించింది. ఆ ఫైనల్లో చైనాకే చెందిన లీ కియాన్ చేతిలో ఓటమి ఎదురైంది. ఈసారి మరో చైనా బాక్సర్ బావో జియీతో తలపడిన లవ్లీనా.. 5-0తో గెలిచి గత ఫలితానికి సమాధానం ఇచ్చింది.
లవ్లీనా గోల్డ్.. భారత బాక్సింగ్‌కు బిగ్ మూమెంట్
లవ్లీనా విజయం(Lovlina Borgohain Gold Medal) భారత బాక్సింగ్‌కు మరో కీలక ఘట్టంగా నిలిచింది. 75 కేజీల విభాగంలో ఆసియా క్రీడల స్వర్ణాన్ని అందుకున్న ఆమె.. గతంలో సాధించిన రజతాన్ని గోల్డ్‌గా మార్చుకుంది.