25 August, 2026 | 6:55 PM

ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడి గా గోవర్ధన్

25-08-2026 03:23 PM

బోథ్ ఆగస్టు 2: బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లా దర్శన్ సారాయి పట్టణంలో రెండు రోజులపాటు జరిగిన ఆలిండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ పదమూడవ మహాసభల లో బోత్ మండల కేంద్రంలో బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి గోవర్ధన్ ను ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో పదవిని కట్టబెట్టిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.