6 September, 2026 | 1:21 AM

హామీల అమలులో ప్రభుత్వం వైఫల్యం

05-09-2026 | 11:52pm

- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్: ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని స్థానిక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎం భూపాల్ రెడ్డి(Former MLA Bhupal Reddy) విమర్శించారు. శనివారం నారాయణఖేడ్ పట్టణంలో నిర్వహించిన నిరసన ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు యువకులకు చేసింది ఏం లేదని అన్నారు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్(Fee reimbursement) పాలిటెక్నిక్ విద్యను నిరుద్యోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు.

పాలిటెక్నిక్ విద్యార్థులు ఇప్పుడే పలు ఆందోళన చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మహిళ విద్యార్థులకు ఉచిత స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. వెయ్యి రోజుల పాలనలో 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. స్థానిక నాయకులు సైతం యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నం జరగలేదని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు