శిశు మందిర్‌లో ఘనంగా పౌర్ణమి యజ్ఞం

27-09-2026 | 02:51pm

ముకరంపుర, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌(Saraswati Shishu Mandir High School)లో భాద్రపద పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో బ్రాహ్మణులు అభిషేక్ ఆధ్వర్యంలో యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల కార్యదర్శి కోల అన్నారెడ్డి, ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్ తదితరులు యజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పౌర్ణమి యజ్ఞం ద్వారా విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు, ధార్మిక చింతన పట్ల అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్ తెలిపారు. విద్యతో పాటు సంస్కారం, సేవాభావం, దేశభక్తి వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గట్టు శ్రీనివాస్, కొత్తూరి ముకుందం, గట్టు రాంప్రసాద్, నడిపెల్లి దీన్ దయాల్ రావు,ఆచార్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు