బాల హనుమాన్ కాలనీలో ఘనంగా అన్న ప్రసాద వితరణ
21-09-2026 | 03:04pm
గణపురం, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని బాల హనుమాన్ కాలనీలో (Bala Hanuman Colony)గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం మహ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని బోనాల రాజమౌళి, ఉమాదేవి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమాన్ని గణపతి పూజ అనంతరం గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దూడపాక శంకర్ దూలం కుమార స్వామి గౌడ్ విడిదినేని అశోక్, మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, బొద్దుల శ్రీనివాస్ ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్ గంధం ఓదాకర్ తదితరులు పాల్గొన్నారు.