నర్సారెడ్డి విగ్రహనికి ఘన నివాళులు

22-09-2026 | 06:37pm

నిర్మల్, సెప్టెంబర్ 22 ( విజయ క్రాంతి):నిర్మల్ జిల్లా కేంద్రం లోని నిర్మల్ బస్ స్టాండ్ ముందర మాజీ పిసిసి అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు పి. నర్సారెడ్డి (Former Minister P. Narsa Reddy) జయంతిని నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు ఆకుల హరీష్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో  పి నర్సారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

కాంగ్రెస్ నేతలు పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, కౌట్ల. B పిఎసిఎస్ చైర్మన్ అయిరరెడ్డి, మాజీ పీసీసీ సభ్యులు రామలింగం, మాజీ డిసిసి సంయుక్త కార్యదర్శి అప్పల మహేష్, సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాధవరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎంబడి రాకేష్, సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ సాక్ పల్లి సురేందర్, మండల ఉపాధ్యక్షులు బొమ్మెడ సత్యం,  నిర్మల్ పట్టణ కాంగ్రెస్ నాయకులు గంగమల్లు, బేరం రాకేష్,కొండాపర్తి ప్రశాంత్,రాస శంకర్,ఆరే రమేష్, ఇ.పోశెట్టి డిసిసి అధికార ప్రతినిధి ముడుపు సత్యనారాయణ, ఎస్సీ సెల్ సెక్రెటరీ కొంతo గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు