హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్
హార్దిక్ అవుట్.. సూర్యాంశ్‌కు బిగ్ ఛాన్స్!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(ardik Pandya Out) రీఎంట్రీకి మరోసారి గాయం అడ్డంకిగా మారింది. ఆస్ట్రేలియా-ఏతో(India A vs Australia A) అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన India A Teamలో తొలుత హార్దిక్‌కు చోటు కల్పించారు. అయితే ఫిట్‌నెస్ సమస్య కారణంగా ఇప్పుడు అతడిని జట్టు నుంచి తప్పించారు. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకునే సమయంలోనే అతడి Fitness ఆధారంగానే మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. తాజాగా మరోసారి గాయం కావడంతో Hardik Pandya Out అయ్యాడని స్పోర్ట్స్‌స్టార్ కథనం పేర్కొంది. దీంతో ఆసీస్-ఏతో వన్డే సిరీస్‌లో హార్దిక్ ఆడటం లేదు.
హార్దిక్ స్థానంలో అతడే..
హార్దిక్ స్థానాన్ని సూర్యాంశ్ శెడ్గేతో భర్తీ చేసినట్లు సమాచారం. పుదుచ్చేరిలో జరగనున్న ఈ సిరీస్ హార్దిక్‌కు కీలకంగా భావించారు. ముఖ్యంగా వన్డేల్లో 10 ఓవర్లు బౌలింగ్ చేసే సామర్థ్యాన్ని పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావించారు. కానీ Hardik Pandya Injury కారణంగా ఆ అవకాశం కూడా కోల్పోయాడు. వచ్చే న్యూజిలాండ్ పర్యటనతో పాటు వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని హార్దిక్ ఫిట్‌నెస్‌పై సెలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత నుంచి హార్దిక్ వన్డే క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో అతడి ODI Fitness ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
టీ20 జట్టులోనూ మార్పు..
ఇదిలా ఉంటే వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు కూడా జట్టులో మార్పు చోటుచేసుకుంది. వాషింగ్టన్ సుందర్ వైదొలగడంతో అతడి స్థానంలో నమన్ ధీర్‌కు అవకాశం కల్పించారు. దీంతో ఇండియా-ఏ జట్టులో నమన్ ధీర్ స్థానాన్ని జార్ఖండ్ స్పిన్నర్ అనుకూల్ రాయ్తో భర్తీ చేసినట్లు సమాచారం. హార్దిక్ రీఎంట్రీపై అంచనాలు పెరుగుతున్న సమయంలో వచ్చిన ఈ Hardik Pandya Latest News అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అతడి తదుపరి రీఎంట్రీ, ఫిట్‌నెస్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.