32 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న బిజెపి నాయకులు
వికారాబాద్, అక్టోబర్ -4 : ఈరోజు అవంతిక కన్స్ట్రక్షన్స్(Avantika Constructions) వారిచే అనంతగిరి హిల్స్(Ananthagiri Hills), హరిత రిసార్ట్ అనంతగిరి లో నిర్వహించబడిన 5 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లు, 32 కిలోమీటర్ల పరుగు పందెంలో(Running race) పాల్గొన్న బిజెపి వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి(Koppula Rajashekhar Reddy) , మాజీ అధ్యక్షుడు సదానంద రెడ్డి, అమరేందర్ రెడ్డి సీనియర్ నాయకులు సుధాకర్ ఆచారి, జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల లక్ష్మయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాఘవేందర్, మీడియా ఇంచార్జ్ మోహన్ రెడ్డి, ఎండోమెంట్ సెల్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలను సత్కరించారు.