మూడంతస్తుల పైనుంచి కింద పడిన హర్షిత్

27-09-2026 | 04:13pm

యశోద ఆసుపత్రిలో.. ప్రాణాపాయస్థితిలో చికిత్సలు..

ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పన్న హస్తం కోసం వేడుకుంటున్న తల్లిదండ్రులు 

నాగిరెడ్డిపేట ,సెప్టెంబర్ 27(విజయక్రాంతి): దొంతుల బైరయ్య, శిరీష(Donthula Bairayya, Shirisha) దంపతులది నిరుపేద సామాన్య కుటుంబం. కష్టపడి చదువుకొని ఉద్యోగం లేక రెక్కల కష్టాన్ని నమ్ముకొని హైదరాబాద్ వలస వెళ్లి ఇరువురు  ప్రైవేట్లో.. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ.. ఇద్దరు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కోటి ఆశలతో చదివించుకుంటూ జీవనం సంతోషంగా ముందుకు వెళ్తున్న సమయంలో.. వారి కుమారుడు హర్షిత్(Harshit) 13 తాముంటున్న ఇంటి మూడో ఫ్లోర్ నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో.. అవయాలు దెబ్బతిని తీవ్ర రక్తస్రావంతో యశోద ఆసుపత్రిలో(Yashoda Hospital) చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు.

తాము కూడా పెట్టుకున్న డబ్బు రెండు రోజుల్లో ఖాళీ కావడంతో ఆసుపత్రి ఖర్చులు(Hospital expenses), వైద్య ఖర్చులకు(Medical expenses) డబ్బులు లేక అప్పన్న స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా(Kamareddy District).. నాగిరెడ్డిపేట్ మండలం నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన దొంతుల సిద్ధిరాములు కుమారుడు బైరయ్య. వైశ్య కుటుంబానికి చెందిన బైరయ్యకు ఆర్థికంగా ఏమీ లేకపోవడంతో.. 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో ఉంటూ భార్య పిల్లలను పోషించుకుంటున్నారు. భైరయ్య కుమారుడు హర్షిత్ హైదరాబాద్లోని రామంతపూర్ నారాయణ స్కూల్లో.. 9వ తరగతి చదువుతున్నాడు.

చదువులో చురుగ్గా ఉండే.. హర్షిత్  ఈనెల 24 ఉదయం. తమ నివాసం నుండి మూడో ఫ్లోర్ నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మలక్పేట్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. చికిత్సలకు ఖర్చవుతుంది అని వైద్యులుచెప్పడంతో కొడుకుని బతికించుకోవడానికి కన్నా పేగు తహతహలాడుతుంది. చేతిలో డబ్బులు లేక అపనాస్థల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు దాతలు కనికరించి. తోచిన ఆర్థిక సాయం అందించి తమ కుమారుని కాపాడాలని కాపాడాలని వేడుకుంటున్నారు. దాతలు.. బైరయ్య ఫోన్ నెంబర్.8179918847, 8374678374 మానవత్వంతో సహాయం చేయండి

మరిన్ని వార్తలు