21 August, 2026 | 6:02 PM

రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

21-08-2026 05:23 PM

బాన్సువాడ, ఆగస్టు 21 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కోటగిరి, పోతంగల్ మండల కేంద్రంలో ఈనెల 23వ తేదీన రామకృష్ణ మఠం హైదరాబాద్, రామకృష్ణ సేవా సమితి కోటగిరి వారి ఆధ్వర్యంలో నిర్వహించే హెల్త్ క్యాంపును మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు. ముఖ్యంగా  వివిధ వ్యాధులతో బాధపడుతున్న పేదవారు  సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా హెల్త్ క్యాంపుకు సంబంధించిన వాల్ పోస్టర్లను సేవా సమితి సభ్యులు ఆవిష్కరించారు.